అనంతపురం జిల్లా తలుపుల మండలంలో అగ్రిగోల్డ్... రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల వివరాలను సేకరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్‌లో వివిధ రకాల పొదుపు చేసుకున్న బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వివరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. తలుపుల మండలం పెద్దన్న వారిపల్లిలో అగ్రిగోల్డ్ సంస్థ 20 మంది రైతుల నుంచి అరవై నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
అగ్రిగోల్డ్ వద్ద ఉన్న ఆధారాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా భూములను పరిశీలించారు. అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూముల విలువ, ప్రస్తుతం మార్కెట్ ఆధారంగా భూముల ధరలు వంటి అంశాలను గురించి తెలుసుకున్నారు. భూములను పరిశీలించిన అనంతరం సీఐడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సిబ్బంది సహా రెవెన్యూ కార్యాలయంలో... పెద్దన్న వారిపల్లి గ్రామానికి చెందిన భూముల దస్త్రాలను పరిశీలించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: అన్నకుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి.. ముగ్గురు మృతి