ETV Bharat / state

బ్యాంకు సొమ్ము మీద మనసైంది.. భౌతిక దూరం కరువైంది!

author img

By

Published : May 4, 2020, 6:54 PM IST

కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భౌతిక దూరం పాటించాలన్న నిబంధన బ్యాంకుల వద్ద అమలు కావటం లేదు. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన తలుపులలో పంట రుణాల నవీకరణ కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.

no social distance in banks at anantapur dst

అనంతపురం జిల్లా తలపుల గ్రామంలో బ్యాంకుల వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. భౌతిక దూరాన్ని విస్మరించి ఎగబడ్డారు. రుణాలు నవీకరణ చేసుకునే రైతులు ముందుగా టోకెన్లు తీసుకోవాలని పల్లెల్లో చాటింపు వేయించారు. టోకెన్ల కోసం ఉదయం ఎనిమిది గంటలకే బ్యాంకు వద్దకు రైతులు చేరుకొని వరుసలో నిల్చున్నారు.

జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్న కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిరి లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ శాఖ ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడారు. బ్యాంకు అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ఆ దృశ్యాలు చూసి షాక్​కు గురయ్యా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.