అనంతపురంలోని జాతీయ ఉద్యానవనంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగజీవాల ఇబ్బందులను కొందరు నిత్య సురభి స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సంస్థ ప్రతినిధులు.. మూగ జీవాలకు ఆహారాన్ని అందించినట్లు చెప్పారు.
పర్యటక ప్రాంతాల్లో ఉన్న పక్షులు, జంతువుల వేదన ప్రస్తుతం దయనీయంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనంతలో మూగజీవాల ఆకలి తీర్చాలని కోరారు. ప్రతి వారం వాటికి కావలసిన ఆహార పదార్థాలను ట్రస్టు ద్వారా అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: