అనంతపురం మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి మృతి చెందినట్లు ఫేస్బుక్లో చక్కర్లు కొడుతోంది. ప్రభాకర్ చౌదరికి దీనిపై పెద్ద ఎత్తున్న ఫోన్లు చేశారు. దీంతో ఆయనే స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు.
తనకేదో జరిగిందని సామాజిక మధ్యమంలో వైరల్ అయిందని.. ఇదంతా అసత్యమని చౌదరి అన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని... తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుతంత్రంలో భాగంగానే దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఇలాంటివి మరోసారి జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ చౌదరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: మంత్రివర్గం సమావేశం దృష్ట్యా రైతుల ముందస్తు అరెస్టులు