ఓ రైతు ఎంతో శ్రద్దగా పెంచుకుంటున్న మామిడి చెట్లను దుండగులు నరికి వేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన పొలంలో వందకుపైగా మామిడి చెట్లను నాటుకున్నాడు. అయితే మామిడి చెట్ల మధ్య అంతర పంటగా శనగ పంట వేసి ఇటీవలే పూర్తిగా నష్టపోయాడు. ఇప్పడు తన మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ మామిడి చెట్లను నరికి వేయడానికి ఆస్తి తగాదాలు కారణమా, మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి