ETV Bharat / state

ఆ యువ దంపతులు.. అన్నదాతలకు మార్గదర్శకులు - zbnf

భూసారం తగ్గినా...పంటకు చీడ పట్టినా.. దిగుమతి పెరగాలన్నా  క్రిమిసంహకారకాలనో, రసాయనాలనో ప్రయోగిస్తుంటారు రైతులు. కానీ వాటి వల్ల అనుకున్న ఫలితాలను సాధించలేక పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ కష్టాల కొలిమి నుంచి అన్నదాతలను బయటపడేసే ప్రయత్నం చేస్తోంది ఓ యువ జంట. శూన్యపెట్టుబడులతో తాము పండించిన పంటనే ఉదాహరణగా చూపించి.. ప్రకృతి సాగు దిశగా రైతులు అడుగులు వేసేలా అవగాహన కల్పిస్తోంది

యువసాయం
author img

By

Published : Apr 23, 2019, 9:33 AM IST

యువ రైతులు

అనంతపూర్​కు చెందిన భీమేశ్... కడపకు చెందిన సునంద 2017లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక వేల రూపాయల జీతాలు ఇచ్చే ఉద్యోగ ఆఫర్లు వచ్చినా వదులుకున్నారు. విచ్చలవిడిగా రసాయనాల వాడకంతో కునారిల్లుతున్న కర్షకులకు ఏదైనా సాయం చేయాలని భావించారు. యాధృచ్ఛికమో, కాకతాళీయమో ఒకే ఆలోచనలున్న భీమేష్, సునందలిద్దరికీ పెద్దలు వివాహం కుదిర్చారు. తమ అభిప్రాయాలే కాదు....ఆశయాలు ఒకటేనని తెలుసుకున్న ఇరువురూ తమ లక్ష్యం దిశగా అడుగులు సారించారు. ఆదే సమయంలో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో శూన్యపెట్టుబడుల వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకుంది. శూన్యపెట్టుబడుల వ్యసాయం- రైతు సాధికార సంస్థ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు పరిచయం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా నాచురల్ ఫార్మింగ్ ఫెలోస్(ఎన్.ఎఫ్.ఎఫ్) లను నియమించుకుంది. దీనికి భీమేశ్, సునంద కూడా ఎంపికయ్యారు. శిక్షణా కాలంలో వ్యవసాయంలో తీసుకురావాల్సిన మార్పులు, అందుకు ఉపయుక్తమయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పూర్తి స్థాయి శిక్షణ పొందారు. అనంతరం చిత్తూరు జిల్లా నారాయణవనం, నాగలాపురం క్లస్టర్లలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించే బాధ్యతలను జెడ్.బీ.ఎన్.ఎఫ్ విభాగం వీరివురికీ అప్పగించింది.

పంటను సాగు చేస్తూ... పాఠాలు నేర్పిస్తూ
చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలోని పాలమంగళం వద్ద భీమేష్, నాగలాపురం వద్ద సునంద.. రెండెకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. తొలుత బీడు బారి పోయిన భూమిలో సారం పెంచేలా సహజ సిద్ధంగా లభించే సేంద్రీయ ఎరువులైన జీవామృతం, పంచగవ్యం మొదలైన వాటిని వ్యవసాయ భూమిపై ప్రయోగించారు. అనంతరం అక్కడ స్థానికంగా పండే పంటకు 70శాతం భూమిని కేటాయించి...మిగిలిన 30శాతం భూమిలో ఫైవ్ లేయర్ మోడల్ విధానంలో తక్కువ భూమిలో వివిధ రకాల కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచటం ప్రారంభించారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా అతి తక్కువ నీటిని వినియోగిస్తూ....చీడపీడలు ఆశించకుండా....సేంద్రీయ ఎరువులను మాత్రమే వినియోగిస్తూ విజయవంతమయ్యారు.

నీరు లేని ప్రాంతంలో అధిక దిగుబడులు
నీటి జాడ అంతగా లేని చోట.... భీమేష్....సునందలు ఎప్పుడైతే పంటను పండిచడం ప్రారంభించారో...అప్పుడే స్థానిక రైతులకు ప్రకృతి వ్యవసాయం...అధునాతన పద్ధతుల విలువ తెలిసింది. మెల్లగా భీమేష్, సునందల పొలానికి వచ్చి చూడటం...ఎరువుల వాడకం...సేంద్రీయ వ్యవసాయం....ఫైవ్ లేయర్ మోడల్ వంటి వాటిని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తాము పండించిన పంటలనే ఉదాహరణగా చూపిస్తూ ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలను రైతులకు వివరిస్తున్నారు. అందరి ఆకలి తీర్చే అన్నదాతలను ఆదుకునేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని భీమేష్, సునంద ఆశిస్తున్నారు. కష్టాల్లో కూరుకుపోయిన వేలాది మందిని ఆదుకోవటం యువత వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. కర్షకుల కన్నీళ్లు తుడిచేలా...అన్నదాతలకు ఆపన్న హస్తం అందించేలా ప్రకృతి ఒడిలో జంటగా సాగిపోతున్నారు.

Intro:Ap_vsp_46_22_chorila_niyantrana_charyalu_ab_c4
వేసవిలో చోరీలకు అరికట్టడంపై పోలీసు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించాలని విశాఖ జిల్లా అదనపు క్రైమ్ ఎస్పి ఉమామహేశ్వర్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు వేసవి నేపథ్యంలో సెలవులకు ఊళ్ళు వెళ్ళేవాళ్ళు అధికంగా ఉంటారని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్( ఎల్ హెచ్ ఎం ఎస్) ద్వారా ఇళ్లకు కెమెరాలు బిగించి పహారా జరపాలన్నారు. అనకాపల్లిలో 15వేల ఇళ్లకు ఎల్ హెచ్ ఎం ఎస్ రిజిస్ట్రేషన్ చేశామని జిల్లావ్యాప్తంగా అధికంగా రిజిస్ట్రేషన్లు చేపట్టేలా చొరవ చూపుతున్నామన్నారు. ఊళ్లకు వెళ్ళే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలు బిగించి పహారానిర్వహిస్తామని పేర్కొన్నారు

Body:మహిళలకు రక్షణ కల్పించేలా శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు పహారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బృందాల్లో మహిళా పోలీసులను సభ్యులుగా చేరి మహిళా రక్షణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు రాత్రివేళ పోలీస్ గస్తీ నిర్వహించే సమయంలో అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నామని వీటిని పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోల్చి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ సందర్భంగా బ్లూ కోల్డ్ పోలీసులతో మాట్లాడారు

Conclusion:బైట్1 ఉమామహేశ్వర్ విశాఖ అదనపు ఎస్పీ క్రైమ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.