బాలల హక్కుల పరిరక్షణకు అనంతపురం జిల్లా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆనంద్ అన్నారు. బాలల సంరక్షణపై అనంతపురంలో వివిద శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
చిన్నారులను వేధింపులకు గురిచేసే ఫిర్యాదులు జిల్లా నుంచి తక్కువగా ఉన్నాయని చెప్పారు. చిన్నారుల హక్కులకు సంబంధించిన పథకాలు జిల్లాలో సంపూర్ణంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. కరోనా బారిన పడిన చిన్నారుల కోసం 'సంవేదన' పేరుతో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామన్నారు.
బాలలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి...
జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆనంద్.. నార్పల పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేశారు. బాలలను వేధింపులకు గురిచేసే ఫిర్యాదులపై స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ ముష్కన్లో భాగంగా రక్షించిన చిన్నారుల గురించి ఆరా తీశారు. స్టేషన్కు వచ్చే బాలలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సిరి, ఛైల్డ్ వెల్ఫేర్ ఛైర్మన్ నల్లని రాజేశ్వరి, ఎస్సై ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు
ఇదీ చూడండి: