అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటున్న భూమి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. పట్టణానికి సమీపంలో జాతీయరహదారికి ఆనుకుని ఉన్న సర్వేనంబరు 400ఏలోని ఆరెకరాల భూమి వక్ఫ్ కు చెందిందే అంటూ ముస్లింలు ఈనెల 8న ఆందోళనకు దిగారు. భూమిని ఆక్రమించుకునే క్రమంలోనే సమీపంలోని గ్రామానికి 40అడుగుల రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులు భూముల కోసం రోడ్డు వేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తమని.. అధికార పార్టీ కార్యకర్తలు అన్నారు. ఎమ్మెల్యేకి, ఇతర నాయకులకు కానీ సెంటు భూమి ఇక్కడ లేదన్నారు. నిరసనకారులకు పోలీసులు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
ఇదీ చూడండి: 'వైకాపా నేతలు వేధిస్తున్నారు.. కాపాడండి'