అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీపీఐ కాలనీ సమీపంలోని ముళ్ల పొదల్లో గుర్తు తెలియని యువకుని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన సాకే అనిల్(24)గా గుర్తించారు. అనిల్ ఐచర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
2019లో సింగనమలకు చెందిన తలారి చంద్రశేఖర్ అనే ఐచర్ డ్రైవర్ హత్య కేసులో సాకే అనిల్ నిందితుడు. అనిల్ మెడపై తాడుతో బిగించి చంపిన ఆనవాళ్లు ఉండటంతో ఎవరైనా పథకం ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..