ETV Bharat / state

సారాలో గన్నేరు పప్పు... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - murder

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తను దారుణంగా హత్య చేయించిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరి మండలం బత్తలపల్లి వద్ద గత నెల 18న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్​
హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్​
author img

By

Published : Feb 15, 2020, 12:44 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను హత్య చేయించిన మహిళ

తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేయించింది. తనకల్లు మండలం మరాళ్లపల్లికి చెందిన ముక్కండ్లరెడ్డెప్ప గతనెల 18న కదిరి మండలం బత్తలపల్లి సమీపంలోని బీడుభూముల్లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భార్యే భర్తను హత్య చేయించినట్లు తేలింది. రెడ్డెప్ప హత్యకు అతడి భార్య వివాహేతర సంబంధమే కారణంగా తేలింది.

హతుడి భార్య ఉమాదేవికి కదిరికి చెందిన నరేంద్రతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన రెడ్డప్ప భార్యను మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఉమాదేవి ప్రియుడితో కలిసి ప్రణాళిక సిద్ధం చేసింది. మద్యం అలవాటు ఉన్న రెడ్డప్పను, ఆయన సమీప బంధువులతో కలిసి కదిరి మండలం బత్తలపల్లి పంపారు. నాటుసారాలో గన్నేరు పప్పు కలిపి రెడ్డప్పకిచ్చారు. సారా తాగిన రెడ్డప్ప అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ముందస్తు ప్రణాళిక మేరకు రెడ్డప్ప బంధువైన నరసింహులు అతడి భార్య సత్యమ్మ కలిసి మెడకు తువ్వాలు చుట్టి ఊపిరాడకుండా చేశారు. తర్వాత బండరాయితో తలపై మోది చంపేశారు. హతుడిని గుర్తించడానికి వీలు లేకుండా ప్లాస్టిక్ కవర్ తలకు చుట్టేసి రెడ్డప్ప ఫోన్​ తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తులో భాగంగా నిందితుల్లో నలుగురిని కదిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: ప్రకాశం జిల్లాలో దారుణం... భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.