వేతన బకాయిలు చెల్లించడం లేదని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. కుటుంబపోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా వీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.
అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకలితో అలమటిస్తున్న తమకు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
సెలవుపై వచ్చి.. పొలం పనులు చేస్తూ విద్యుదాఘాతంతో జవాన్ మృతి