అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక ఎమ్మార్వో అందుబాటులో లేకపోవటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా... పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశానికి ఎమ్మార్వో వెళ్లారని తెలిపారు. నామినేషన్లకు అత్యంత కీలకమైన సమయంలో అధికారుల సమావేశం నిర్వహించడం ఏంటని అభ్యర్థులు వాపోతున్నారు.
ఇదీ చూడండి:
జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు...రేపటితో ముగియనున్న గడువు