ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు నేడు చివరిరోజు అయినందున అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో పలు పార్టీల అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 10 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.