56 బీసీ కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించడం జగన్ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రజక అభివృద్ధి సంస్థ చైర్మన్ రంగయ్య అన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. రజకులు చేసిన విజ్ఞప్తులను అన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ. 33 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా పేల్చి ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి: