Chestha attack: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇటీవల అడవి జంతువుల బెడద అధికమైంది. పలుచోట్ల పశువులు, మేకలపై చిరుత దాడి చేస్తోంది. మరోవైపు ఎలుగుబంట్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వివిధ సంఘటనలల్లో ప్రజలను గాయపరిచిన ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో ఎర్రప్పఅనే రైతుకు చెందిన స్థలంలో కట్టి ఉంచిన ఆవు దూడపై చిరుత దాడి చేసి తినేసింది. మరోవైపు పరమసముద్రం మండల కేంద్రంలో పాడుబడిన ఇంట్లో ఎలుగుబంటి తిష్ట వేసింది. దానిని గుర్తించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కళ్యాణదుర్గం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. ఆ ఎలుగుబంటి విశ్రాంతి కోసం ఆ ఇంట్లోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
- కోహ్లీ ఆవేదన, మానసికంగా కుంగిపోయి అప్పటినుంచి బ్యాట్ పట్టలేదంటూ
- అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత
- ఈ భామల అందాలు అదరహో, చూసేయండి మరి