ETV Bharat / state

అనంతపురం మేయర్​గా మహమ్మద్‌ వసీం..? - anantapur latest news

అనంతపురం జిల్లాలో నగర, పురపాలికల్లో మేయర్‌, ఉపమేయర్లు, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. ఆయా పదవులు ఎవరికి దక్కుతాయోనన్న చర్చ సర్వత్రా నెలకొంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొలిక్కిరాలేదు. బుధవారం ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించి, చర్చలు జరిపినా అభ్యర్థుల పేర్లు మాత్రం వెల్లడించలేదు.

mohammed wasim as the mayor of anantapur
అనంతపురం నగరపాలక మేయర్​గా మహమ్మద్‌వసీం ?
author img

By

Published : Mar 18, 2021, 9:21 AM IST

నేడు నూతన పాలకవర్గాలు కొలువుతీరనున్నాయి. అనంత నగరపాలక, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్‌, ఉప మేయర్లు, ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిల్‌ హాళ్లను నూతన హంగులతో తీర్చిదిద్దారు.

మైనార్టీ వర్గానికి మేయర్‌ పదవి, ఉపమేయర్‌ పదవి బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైకాపా తరఫున 38వ డివిజన్‌ నుంచి గెలుపొందిన మహమ్మద్‌వసీంకు మేయర్‌ పదవి దాదాపు ఖరారైనట్టే. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే ఇద్దరు ఉపమేయర్లను ఎన్నుకోనున్నారు. అందులో ఒకటి మహాలక్ష్మి శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది. కానీ ఇన్‌ఛార్జి మంత్రి పదవుల గురించి ప్రకటించిన వెంటనే మహాలక్ష్మి శ్రీనివాస్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఉపమేయర్‌ పదవిపై ఆయన అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. మరో ఉప మేయర్‌ ఎవరన్నది తేలాల్సి ఉంది.

ఇదీ ప్రక్రియ..

నగరపాలక సంస్థకు సంబంధించి కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఎన్నికైన కార్పొరేటర్ల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మున్సిపాలిటీల్లో ఆయా కమిషనర్లు ప్రిసైడింగ్‌ అధికారులుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మేయర్‌, ఉప మేయర్లు, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. దీనికి ఆయా పార్టీలు జారీ చేసే విప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. తాడిపత్రి మినహా అన్ని చోట్లా వైకాపా అభ్యర్థులే పూర్తి మెజారిటీ సాధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన వారే మేయర్‌, ఛైర్మన్లుగా ఎన్నికవుతారు. సదరు అభ్యర్థిని బలపరుస్తూ మరొకరు ప్రిసైడింగ్‌ అధికారికి డిక్లరేషన్‌ అందజేయాలి. ఎన్నికకు సరిపడా కోరం ఉందోలేదో పరిశీలించి ప్రక్రియ మొదలుపెడతారు. హాజరైన సభ్యుల్లో సగానికి పైగా చేతులు పైకెత్తితే చాలు అభ్యర్థిని మేయర్‌ లేదా ఛైర్మన్‌గా ప్రకటిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పాల్గొంటారు.

ఎవరిని వరించేనో..

జిల్లాలో నగర కార్పొరేషన్‌తోపాటు ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. తాడిపత్రిలో మాత్రం తెదేపా విజయం సాధించింది. అయితే ఇప్పటివరకు మేయర్‌, ఉప మేయర్‌, ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్లు ఎవరనేది వైకాపా ప్రకటించలేదు. తాడిపత్రిలోనూ తెదేపా తమ అభ్యర్థుల పేర్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురానికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. నగరపాలకసంస్థ మేయర్‌ పదవిని మైనార్టీకి, ఉపమేయర్‌ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తామని ప్రకటించారు. వారి పేర్లను గురువారం ఉదయం వెల్లడించనున్నారు.

గుంతకల్లులో వీరే..

గుంతకల్లు మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎస్‌.భవాని, వైస్‌ఛైర్మన్‌గా మైమున్‌ పేర్లను ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఎంపీ రంగయ్య ప్రకటించారు.

ఇదీ చదవండి:

పోలీసు వలయంలో తాడిపత్రి పురపాలక భవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.