అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. 16 నెలల నుంచి హిందూ దేవాలయాలపై, రథాలపై దాడులు జరుగుతున్నాయని తిప్పేస్వామి విమర్శించారు. నిన్న కళ్యాణదుర్గంలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు. దాడులు జరిపిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించడం లేదని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దేవాలయాలను రక్షించడంలో దృష్టి సారించక ప్రశ్నించే అచ్చెన్నాయుడు లాంటి నేతలను జైలుకు పంపిస్తున్నారన్నారు.
ఈఎస్ఐ స్కాంతో సంబంధమున్న మంత్రి జయరాంపై మాత్రం ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోలేదని తిప్పేస్వామి అన్నారు. ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి జయరాంను తొలగించాలన్నారు. ఈ సంవత్సరం వేరుశెనగ పంట పూర్తిగా నష్టపోయిందని.. నష్టాన్ని అంచనా వేసి... రైతులకు అందించాలని ఈరన్న ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్