అనంతపురం జిల్లా తలుపుల మేజర్ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన శ్రీలత ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సర్పంచి, ఉపసర్పంచి, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి శాసన సభ్యుడు సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులను అత్యధిక స్థానాల్లో గెలిపించారని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైకాపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ... అంతా సహకరించారు'