ETV Bharat / state

మంత్రి ఆళ్ల నానికి బాలకృష్ణ ఫోన్‌ - హిందుపూరం వార్తలు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేశారు. కొవిడ్‌ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. వెంటిలేటర్లు ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని.. వాటిని వినియోగంలోకి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

mla balakrishna
ఎమ్మెల్యే బాలకృష్ణ
author img

By

Published : May 2, 2021, 2:26 PM IST

హిందుపురంలోని కొవిడ్‌ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్‌ చేసి కోరినట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. వెంటిలేటర్లు ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని.. వాటిని వినియోగంలోకి తీసుకు రావాలని కోరామన్నారు. తక్షణం ఫిజీషియన్‌, అనస్తీషియన్‌, ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని అనుగుణంగా నియమించాలని సూచించినట్లు తెలిపారు.

శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జేసీ సిరి.. హిందూపురం కొవిడ్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 8 మంది రోగులకు వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించారు. మరో వైపు సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు భోజన వసతి, నీటి సరఫరాను మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు పరిశీలించారు.

ఇదీ చదవండి

అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?

'సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.