Mirchi farmers problems: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో బ్యాడిగ రకం మిరప దాదాపు 30వేల ఎకరాల్లో సాగు చేశారు. పంట ఆరంభంలో బాగానే ఉన్నా చేతికందే సమయంలో నల్ల తామర వైరస్ సోకింది. దీంతో ఎర్రని మిరప కాయలు రంగు మారి రైతులను నిండా ముంచాయి. విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గుత్తకు తీసుకున్న ఐదెకరాల్లో ఇదే మిరప సాగు చేయగా ఇప్పుడు కాయలు రంగు మారి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
ఇదే పంట సక్రమంగా చేతికందితే రూ.10 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం కాదు కదా.. ఏడాదికి ఎకరాకు రూ.34,500 చొప్పున గుత్త మొత్తం, సాగుకు ఖర్చయిన రూ.8,15,000 ఎలా తీర్చాలో తెలియక తలపట్టుకున్నారు. రాష్ట్రంలో మిరప సాగు చేసిన రైతులందరి పరిస్థితి ఇలానే ఉంది.
ఇదీ చదవండి:
అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. రైతుకు రెండు యూరియా బస్తాలే