అనంతపురం జిల్లా పెనుకొండ కోటలో పర్యటిస్తున్న ఇస్కాన్ ప్రతినిధులతో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శంకరనారాయణ సమావేశమయ్యారు. బెంగళూరుకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులు పెనుకొండ కోటపై శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు... 12 ఎకరాలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక్కడున్న నరసింహస్వామి ఆలయంతోపాటు పెనుకొండ కోటను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: