అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ గోడౌన్ వద్ద గ్రామస్థాయి వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని మంత్రి అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని... నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: