అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన 74 వ స్వాతంత్య్ర దినోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల శకటాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారీ రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్నతధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ గతంలో ఏన్నడూ లేని విధంగా జిల్లాలో అధిక వర్షపాతం కురిసిందని, రైతులందరూ పంటలు సాగు చేయగలిగారని అన్నారు.
అనంతపురంలో జెండా ఎగురవేసిన మంత్రి శంకరనారాయణ - independance celebrations ananthapuram district
అక్షర క్రమంలో ముందున్న అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ముందు ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.