విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని... మంత్రి శంకర నారాయణ సూచించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్-2020 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారుచేసిన ఎన్నో రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రస్థాయి పోటీలకు 31 మందిని ఎంపిక చేశారు. వారికి మంత్రి ప్రశంసపత్రాలు అందజేశారు.
ఇవీ చదవండి..