రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పరిగి మండలం కొడిగెనహళ్లిలో బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పరిశ్రమల్లో 70శాతం స్థానికులకే ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తామని చెప్పారు. లేపాక్షి మండలం సిరివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
ఇదీ చదవండీ... 'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'