జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కంపెనీ నివేదికలను తప్పుబడుతున్న చంద్రబాబు... ఏ కమిటీ ఆధారంగా అమరావతిలో రాజధానిని నిర్మించ తలపెట్టారో చెప్పాలని... బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ డిమాండ్ చేశారు. మంత్రి అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై ముందే లీకులు ఇచ్చి తన సొంత మనుషులతో కలసి చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల ముసుగులో అమరావతిలో తెదేపా నేతలు ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు కావాలన్న చంద్రబాబు... ఇప్పుడు కేవలం 3వేల కోట్లు మాత్రమే చాలంటున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..