అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ కియా సంస్థ ఉద్యోగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కియా లీగల్ హెడ్ జ్యూడ్, ప్రభుత్వ సమన్వయ అధికారి సోమశేఖర్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, పోలీసు అధికారులతో చర్చించారు. ఆర్అండ్బీ వసతి గృహంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కియా పరిశ్రమకు చెందిన ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌గా నిర్ధరణ అయిన తర్వాతే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శంకరనారాయణ సూచించారు.
కియా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇబ్బందులు పెట్టకుండా వారికి త్వరగా కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కియా పరిశ్రమ ఇచ్చిన లిస్ట్ ప్రకారం మాత్రమే ఉద్యోగులను అనుమతించాలని అన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులను నేరుగా కియా ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్‌కు తరలించి పరీక్షలు నిర్వహించాలన్నారు.