లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి స్పిన్నింగ్ మిల్లు వద్ద ఒరిస్సా, అస్సాం ,జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి గుత్తేదారు వేతనాలు చెల్లించలేదని సరిగా భోజనం పెట్టడంలేదని కార్మికులు ఆరోపించారు. ఆ ఆందోళన చేస్తున్న వలస కార్మికులతో పరిగి ఎస్ఐ శ్రీనివాసులు చర్చించారు. వేతనాలు వెంటనే చెల్లించాలని, భోజన సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకోవాలని గుత్తేదారుకు సూచించారు.
గోడు వెళ్ళబోసుకుంటున్న వలస కార్మికులు - వలస కార్మికులపై లాక్డౌన్ ప్రభావం
అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి స్పిన్నింగ్ మిల్లు వద్ద ఒరిస్సా, అస్సాం ,జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వలస కార్మికులకు మద్దతుగా ఎస్ఐ శ్రీనివాసులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు.