ETV Bharat / state

Corona Vaccine: చనిపోయిన వ్యక్తికి టీకా..అది ఎలా అంటే..!

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్లు నమోదు చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అదే కుటుంబంలో మరో యువకుడు గతంలోనే రెండో డోస్‌ టీకా వేయించుకోగా.. అతనికి మొదటి డోస్‌ పూర్తి చేసుకున్నట్లు సాయంత్రం సందేశం వచ్చింది. ఇలా ఒకేరోజు తప్పుడు సందేశాలు రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

Corona Vaccine
Corona Vaccine
author img

By

Published : Sep 12, 2021, 4:35 PM IST

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్లు నమోదు చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అనంత నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల నుంచి హిందూపురంలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో జులైలో చనిపోయారు. అయితే శనివారం ఉదయం ఆయనకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు ఆయన కుమారుడి చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. అదే కుటుంబంలో మరో యువకుడు గతంలోనే రెండో డోస్‌ టీకా వేయించుకున్నాడు. మొదటి డోస్‌ పూర్తి చేసుకున్నట్లు సాయంత్రం సందేశం వచ్చింది. ఇలా ఒకేరోజు తప్పుడు సందేశాలు రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

కొవిడ్‌ టీకాల నమోదుపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యఆరోగ్య సిబ్బందితోపాటు ఏఎన్‌ఎంలకు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలకు అప్పగించారు. కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయా గ్రామాల్లోని ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాలో చాలామంది రెండో డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో ఫిర్యాదులు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల టీకాకు దూరమవుతున్నామని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చదవండి

60 ఏళ్ల వృద్ధుడు మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.