ETV Bharat / state

ఉద్ధృతంగా మరువ వంక.. అక్కడికక్కడే వ్యక్తి మృతి - శ్రీరాములు

అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరువ వంక, గుత్తిచెరువు, మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  కొజ్జాపల్లి సమీపంలోని అంకోల - బళ్లారి 67వ నెంబర్ జాతీయ రహదారిపై వాగులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి.

ఉద్ధృతంగా మరువ వంక.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

author img

By

Published : Oct 2, 2020, 5:27 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరువ వంక, గుత్తిచెరువు, మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజగా గుత్తి మండలం కొజ్జాపల్లి సమీపంలోని మరువ వంక, దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన రైతు శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు.

గుత్తి వైపు వస్తుండగా..

చెర్లోపల్లికి చెందిన బాధితుడు గుత్తి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వాగులో కొట్టుకుపోతున్న రాములు మృతదేహాన్ని బయటకు తీశారు.

స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలింపు..

పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొజ్జాపల్లి మరువ వంకలో చిక్కుకున్న ఆటో, లారీ, ఆటోలో ఉన్న ప్రయాణికుల్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.

ముందస్తులో భాగంగా బందోబస్తు..

పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయం అయినా సంబంధిత అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.