ETV Bharat / state

సన్న, చిన్నకారు రైతులకు.. 'సీఎం యాప్' చేయూత

author img

By

Published : Oct 3, 2020, 7:35 PM IST

రైతులకు గిట్టుబాట ధర కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తోంది మార్క్​ ఫెడ్ సంస్థ. 'సీఎం యాప్' పేరుతో ఓ అప్లికేషన్​ను తీసుకువచ్చింది. ఈ యాప్ తో మార్కెట్​లో ధరలు తక్కువ ఉంటే మార్క్​ఫెడ్ వెంటనే రైతులకు గిట్టుబాట ధర కల్పించి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది.

CM app
CM app
సన్న, చిన్నకారు రైతులకు వరం.... ఈ 'సీఎం యాప్'

ఖరీఫ్​లో రైతులు సాగుచేసిన పంటలను కొనుగోలు చేయటానికి మార్క్​ఫెడ్ ఈ సారి యాప్​ను సిద్ధం చేసింది. చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి, వారి ఉత్పత్తులు కొన్న తరువాతనే... పెద్ద రైతుల పంటలను కొనేలా సీఎం యాప్​(కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్​మెంట్) పేరుతో ఓ అప్లికేషన్​ను తయారు చేసింది. ప్రభుత్వం ఈసారి ఖరీఫ్​లో 24 పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించింది.

ఈ ధరల కంటే మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతులు నష్టపోకుండా మార్క్​ఫెడ్ రంగంలోకి దిగుతుంది. కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఇందు కోసం రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ప్రతి రోజూ గ్రామంలో పంటల ధరలను మార్క్​ఫెడ్ యాప్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్​ను పర్యవేక్షించే ఉన్నతాధికారులు పంట ఉత్పత్తులకు మార్కెట్​లో ధర తగ్గినపుడు... వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆర్​బీకేల్లో పంట కొనుగోలు

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మొక్కజొన్న, సజ్జ, రాగి పంటలు రైతులకు చేతికొచ్చాయి. ఈ పంటల ధరలు మార్కెట్​లో చాలా తక్కువగా ఉన్నాయి. ఏటా దళారులు ఈ పంటలను అథమ స్థాయి ధరలతో కొనుగోలు చేసేవారు. అయితే ఈసారి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మార్కెట్​లో ధర పతనమైనందున ఈ నెల 16 నుంచి ఈ మూడు పంటలను మార్క్​ఫెడ్ కొనుగోలు చేస్తోంది. మొక్కజొన్న, సజ్జ, రాగి పంటలు రైతులు ఎంత విస్తీర్ణంలో సాగుచేసినా, ప్రభుత్వం మాత్రం ఐదు ఎకరాల విస్తీర్ణంలో వచ్చిన దిగుబడిని మాత్రమే కొనుగోలు చేయనుంది.

ప్రతి రైతు నుంచి మొక్కజొన్న గరిష్ఠంగా వంద క్వింటాళ్లు, సజ్జ 25 క్వింటాళ్లు, రాగి 50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుంది. ఇందుకోసం గురువారం నుంచే రైతుల పేర్లు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో రైతుల పేర్లు నమోదు చేసుకొని, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మూడు పంటలను రైతులు ఆర్బీకేల్లోనే విక్రయించాలని వ్యవసాయశాఖ, మార్క్​ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త యాప్ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నా, గ్రామంలో వచ్చిన దిగుబడిలో 30 శాతం మాత్రమే కొనుగోలు చేసే నిర్ణయంపై మాత్రం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.