2015లో తొలిసారిగా అనంతపురంలో జువాన్ అల్ట్రా మారథాన్ పరుగును నిర్వహించారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం, నాయనపల్లి గ్రామ సమీపంలో ప్రారంభమైన ఈ పరుగు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి వరకు 150 కి.మీ సాగింది. ఈసందర్భంగా కిలోమీటర్‌కు ఒకర్ని చొప్పున అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన చదువు, వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. మొత్తం 150 మంది దాతలను పరిచయం చేసింది ఈ పరుగు.
2017లో 170 కిలోమీటర్ల మారథాన్ చేపట్టారు. ఈ పరుగులో 24 మంది స్పెయిన్ , స్థానిక క్రీడాకారులు పాల్గొని 20 లక్షల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని దివ్యాంగుల వైద్య పరీక్షల పునరావాసం కోసం ఖర్చు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆధునిక పరికరాలను కొనుగోలు చేశారు.
2018లో ముచ్చటగా మూడోసారి పరిగి మండలం ఎర్రగుంట్లలో పరుగును ప్రారంభించారు. 170 కి.మీ. నిర్వహించిన ఈ పరుగులో ఆర్డీటీ దత్తత గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ మారథాన్ ద్వారా 43 మందికి పక్కా గృహాలు నిర్మించారు.
2019లో నాలుగో ఆల్ట్రా మారథాన్ పరుగును నల్లమడ మండలం, సుందరయ్య కాలనీలో నిర్వహించారు. గుడిసెల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మొత్తం 45 మందికిల ఈ పరుగుద్వారా ఇల్లు నిర్మించారు.
నిన్న చేపట్టిన ఐదో పరుగు ద్వారా శ్రీశైలంలోని 39 మంది చెంచు కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికి అవసరమైన మొత్తం నిధులను పరుగు ద్వారా సేకరిస్తారు. ఈసారి పరుగు ఆర్డీటీ ప్రధాన కార్యాలయం నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ప్రాంగణంలోని ఫెర్రర్ ఘాట్ వరకు 170 కి.మీ కొనసాగింది. ఈ పరుగులో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇదీచదవండి