అనంతపురం నగరంలోని ఆర్కేనగర్లో ఓ వ్యక్తి మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన సాధిక్ వలీ.. తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసైన అతన్ని ఆరేళ్ల క్రితమే భార్య వదిలేసిందన్నారు. నాటినుంచి తాగుడు మరింత ఎక్కువవై... జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్సై నాగ మధు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: