ETV Bharat / state

అనంతలో ఘనంగా గాంధీ జయంతి...ప్లాస్టిక్ నిషేధించాలంటూ ర్యాలీలు - ananyha

మహాత్మాగాంధీ 150వ జయంతిని అనంత జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్లాస్టిక్​ను నిషేధించాలంటూ ర్యాలీలు చేపట్టారు. పలుచోట్ల 2కే రన్ నిర్వహించారు.

అనంతలో ఘనంగా గాంధీ జయంతి... ప్లాస్టిక్ నిషేధించాలంటూ ర్యాలీలు
author img

By

Published : Oct 2, 2019, 10:53 PM IST

అనంతలో ఘనంగా గాంధీ జయంతి... ప్లాస్టిక్ నిషేధించాలంటూ ర్యాలీలు

అనంతపురం జిల్లాలో మహాత్ముని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మడకశిరలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ర్యాలీ నిర్వహించారు ఈ ప్రదర్శనలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు.

స్వచ్ఛతను పాటిస్తూ, పాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడతామని కదిరి మున్సిపల్ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జాతిపిత జయంతిని పురస్కరించుకుని పట్టణములో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, విరివిగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను పట్టణవాసులకు వివరించారు. నేటి నుంచి పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలులోకి తీయనున్నట్లు కమిషనర్ ప్రమీల తెలిపారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని నార్పలలో 2కే రన్ ప్రారంభించారు. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దుకాణదారుల యజమానులకు ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. ఇలాగే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు దుకాణాల యజమానులను హెచ్చరించారు.

ఇవీ చూడండి-119 కోసం...80 వేలు పోగొట్టుకున్నాడు

Intro:మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా 150మంది బాలలు గాంధీ వేషధారణతో పర్యటించి పట్టణంలోని ప్రజలకు ఆయన త్యాగాలను గుర్తు చేశారు.

Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన పోరాట త్యాగాలను ను స్మరించుకుంటూ సిద్ధార్థ విద్యానికేతన్ పాఠశాల వారు 150 మంది బాలల చేత గాంధీ వేషధారణ ధరించి పట్టణంలో రహదారులలో ర్యాలీగా బయలుదేరి ఆయన పోరాటాలను కొనియాడుతూ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ ప్రదర్శనలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వతంత్ర సమరయోధుల కుటుంబీకుల వారసులు గాంధీ విగ్రహంకు పూలమాల వేసి అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

Conclusion:సభలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి, సమరయోధులు వారసులు జాతిపిత మహాత్మా గాంధీ త్యాగాల గురించ కొనియాడారు. మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమందరం నడవాలని ఆయన వేషాధారణ ధరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బాలలు తెలిపారు.

నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర.

మొబైల్ నెంబర్ : 8019247116.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.