కళ్లలో కారం చల్లి పింఛన్ డబ్బును దొంగలు దోచుకెళ్లారని ఓ వాలంటీర్ నాటకం ఆడాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని మూడో వార్డులో జరిగింది. వాలంటీర్ ఈరప్ప ప్రభుత్వ ఆసరా పింఛన్ డబ్బును పంపిణీకి తీసుకెళుతుండగా... దారి మధ్యలో నలుగురు దాడి చేసి కళ్లలో కారంకొట్టి డబ్బు ఎత్తుకెళ్లారని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ జరపగా.. వాలంటీర్ ఈరప్ప నాటకం ఆడాడని కొన్ని గంటల్లోనే నిగ్గుతేలింది. ఈరప్పకు ఇచ్చిన 43 వేల రూపాయలు మార్గ మధ్యలో పోగొట్టుకున్నాడని సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపాడు. పంపిణీ చేసేందుకు డబ్బులు లేక అలా నటించాడని.... అతనిపై ఎవరూ దాడి జరపలేదని వివరించారు.
ఇదీ చూడండి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి!