ఉరవకొండలో 9 మందిపై పిచ్చి కుక్కు దాడి - అనంతపురంలో 9 మందిపై పిచ్చి కుక్కు దాడి
ఉరవకొండలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న 9 మందిపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఉరవకొండ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా... అక్కడి సిబ్బంది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ కూడా సిబ్బంది త్వరగా స్పందించలేదని బాధితులు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే... అధికారులు వెంటనే స్పందించాలని బాధితులు కోరుతున్నారు.