రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువుకు వరద(Anantapuram floods) పోటెత్తింది. దాంతో చెరువు మరువ ఉధృతంగా పారుతోంది. ఆ నీటిని సైకిల్‌పై దాటేందుకు ప్రయత్నించిన యువకుడు.. వరదలో కొట్టుకుపోయాడు. అతనితోపాటు మరో యువకుడు సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి.. వారిని కాపాడారు.
ఇదీ చదవండి: Floods in Tirupati: తిరుపతికి తప్పని వరద.. ముంపులోనే పలు కాలనీలు