ETV Bharat / state

ఇటుకల లోడ్​లో కర్ణాటక మద్యం సీసాలు తరలింపు.. ఇద్దరు అరెస్టు - ఉరవకొండలో మద్యం అక్రమ రవాణా వార్తలు

అనంతపురం జిల్లా విడపనకల్​ చెక్ పోస్టు వద్ద ఇటుకల లోడ్​లో.. మద్యాన్ని బాక్సుల్లో పెట్టి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

liquor illegal transport in uravakonda ananthapuram district
ఇటుకల లోడ్​లో కర్ణాటక మద్యం సీసాలు తరలింపు
author img

By

Published : Jun 21, 2020, 10:44 AM IST

Updated : Jun 21, 2020, 3:46 PM IST

రాష్ట్రంలో మద్యం రేట్లు భారీగా పెరగటంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాలు ఎక్కువయ్యాయి. అనంతపురం జిల్లా విడపనకల్​ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు టాటా ఏస్ వాహనంలో ఇటుకల లోడ్ వేసుకు వస్తుండగా తనిఖీ చేశారు.

ఇటుకలు తొలగించి చూడగా మద్యం సీసాల బాక్సులు కనిపించాయి. వాటి విలువ రూ. 98 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు కడప జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి: ఒకేసారి ఐదుగురు యువకులు అదృశ్యం

Last Updated : Jun 21, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.