కడప జిల్లా ప్రొద్దుటూరు అబ్కారీ శాఖ అధికారులు దువ్వూరు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో.. మద్యంతో వస్తున్న వాహనాన్ని గుర్తించారు. తెలంగాణా నుంచి తరలిస్తున్న 451 మద్యం సీసాల స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. చోదకుడితోపాటు ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని కొండాపురం గ్రామం సమీప వ్యవసాయ పొలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువచేసే కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, వాహనాలు సీజ్ చేశారు.
కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటు సారా కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం, నాటుసారా తయారు చేస్తున్న వారి పై 45 కేసులు నమోదు చేశారు. ఈకేసుల్లో 55 మందిని అరెస్టు చేసి 15 వాహనాలు సీజ్ చేశారు. 232 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకుని 2,900 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 1,373 మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండు బాడు పంచాయతీ శివారు బలిజ పాలెం గ్రామ శివారులో నాటు సారా తయారీ స్థావరాలపై రోలుగుంట పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 1500 లీటర్ల పులుపు ను ధ్వంసం చేశారు. సారా తయారీ కి ఉపయోగించే 13 ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి: