ETV Bharat / state

ఎక్సైజ్ అధికారుల దాడులు.. భారీగా గంజాయి, సారా పట్టివేత

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. గంజాయి, సారాను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

liquor and ganja seized in some districts of andharapradesh
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మద్యం, గంజాయి స్వాధీనం
author img

By

Published : Mar 11, 2020, 10:01 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మద్యం, గంజాయి స్వాధీనం

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని జక్కేపల్లి, మల్లినాయకనపల్లి తండాల్లో పోలీసులు నాకాబందీ చేశారు. ఓ ఇంటి వద్ద కర్ణాటకకు చెందిన 93 మద్యం బాటిళ్లు, మరోఇంటి దగ్గ 60 లీటర్లు నాటు సారా, 6 కిలోల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం ఏజెన్సీ పరిధిలో.. పెద్ద మొత్తంలో గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. జీ.మాడుగుల మండలం ఈదులబయలు కూడలి వద్ద తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న 3 కమాండర్ జీపులను తనిఖీ చేశారు. 1575 కిలోల గంజాయి గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. ఒకరిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సారా నియంత్రణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లోని కురుపాం గుమ్మలక్ష్మీపురం చినమేరంగి తదితర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో దాడులు నిర్వహించారు. 2 వేల300 లీటర్ల పులిసిన ఊటతో పాటు 160 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణా జిల్లా నూజివీడు విజయవాడ రోడ్​లో ద్వారకానగర్ ఎస్ఆర్ఎం ఎస్టేట్ వద్ద నిషేధిత గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

తనిఖీల్లో రూ.18 లక్షల నగదు పట్టివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.