ETV Bharat / state

నవశకానికి లేపాక్షి నవోదయం.. గ్రామీణ విద్యార్థులకు వరం

author img

By

Published : Nov 9, 2020, 6:59 AM IST

విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నవోదయ విద్యాలయాలు నవశకానికి నాంది పలుకుతున్నాయి. ప్రతిభ ఉన్నా చదువుకోలేని గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతోంది జవహర్‌ నవోదయ విద్యాలయం.

నవశకానికి లేపాక్షి నవోదయం.. గ్రామీణ విద్యార్థులకు వరం
నవశకానికి లేపాక్షి నవోదయం.. గ్రామీణ విద్యార్థులకు వరం

ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను ఉచితంగా అందించడంతో పాటు నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఈ విద్యాలయాన్ని 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇక్కడ విద్యాబోధన సాగుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అందుకే ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

నవశకానికి నవోదయం.. గ్రామీణ విద్యార్థులకు వరం

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండిలా..

నవోదయ విద్యాలయంలో 2021-2022 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునితో ధ్రువీకరణ పత్రం తీసుకుని మీసేవా కేంద్రంలో లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో లేదా ఆన్‌లైన్లో డిసెంబర్‌ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 8న..

ఏటా 7 వేల నుంచి 8 వేల వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, కేవలం 80 మందికి మాత్రమే ఇందులో ప్రవేశం దొరుకుతుంది. వీరిలో కూడా రిజర్వేషన్లలోని 16 కేటగిరీల నుంచి ఎంపిక జరుగుతుంది. ఇందులో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ప్రవేశ పరీక్ష 2021 ఏప్రిల్‌ 10వ తేదీన జరుగుతుంది.

చదువు.. క్రీడలు

లేపాక్షి విద్యాలయంలో చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ విద్యన్యభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ఎన్‌సీసీ విభాగంలో ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. నవోదయ విద్యాలయాల్లో ఏటా జరిగే జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో లేపాక్షి విద్యార్థుల ముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడి విద్యార్థులు 250కుపైగా జ్ఞాపికలు, పతకాలు, ప్రశంసాపత్రాలు పొందారు.

కళలకు వెలుగులు

ఏటా నవోదయ విద్యాలయాల పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన ప్రాచీన గొరవయ్యల నృత్యానికి జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విద్యార్థులకు ప్రస్తుతం పార్లమెంటరీ విధానంపై అవగాహన కలిగేలా ఏటా యూత్‌ పార్లమెంట్‌ను నిర్వహించి ఇక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులను దిల్లీలో జరిగే పార్లమెంట్‌ సమావేశాలకు తీసుకెళ్లడం ఈ విద్యాలయాల ప్రత్యేకత.

ప్రవేశ పరీక్ష సిలబస్‌ ఇలా..

ప్రవేశ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. పరీక్ష సమయం 2.30గంటలు.

రీజనింగ్ ‌: (బొమ్మలను విద్యార్థి తన మేథస్సును ఉపయోగించి గుర్తించడం) : ఈ విభాగంలో 40 ప్రశ్నలు - 50 మార్కులు. ఇందులో భిన్నమైనవి, సదృశ్య బొమ్మలు, ఏకరూప, సంబంధిత బొమ్మలు గుర్తించడం వంటి అంశాల నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.

అర్థమెటిక్ ‌: 20 ప్రశ్నలు- 25 మార్కులు. ఇందులో సంఖ్యామానం, లాభనష్టాలు, బారువడ్డీ-చక్రవడ్డీ, కాలం-పని, వేగం-దూరం, చుట్టుకొలత - వైశాల్యం-ఘన పరిమాణం, ద్విపరిమాణం- త్రిపరిమాణం, సరళరేఖలు, వక్రరేఖలు, దత్తాంశ నిర్వహణ, క్యాలెండర్‌ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.

లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లీష్‌) : ఈ విభాగంలో 20 ప్రశ్నలు - 25 మార్కులు. ఇందులో 4 పేరాగ్రాఫ్‌లు ఇస్తారు. ఒక్కో దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి.

విలువలతో కూడిన విద్యే లక్ష్యం..

విద్యార్థుల ఉజ్వల భవితను దృష్టిలో ఉంచుకొని విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. అధునాతన హంగులతో, అన్ని వసతులతో, అత్యుత్తమ నైపుణ్యం కల్గిన ఉపాధ్యాయ బృందం సహకారంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతిభకు మెరుగులు దిద్దుతూ వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా చూడడమే మా ధ్యేయం.

- భాస్కర్‌కుమార్‌, ప్రిన్సిపల్‌

ఇవీ చూడండి :

సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.