అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణ శివార్లలోని బ్రహ్మసముద్రం గుట్టపై చిరుత సంచరిస్తుండటంతో స్థానికుల్లో కలవరం మెుదలైంది. గుట్టపై ఉన్న ఓ బండరాయిపై చిరుత కనపించటంతో అటుగా వెళ్తున్న కొందరు తమ సెల్ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. ఈ దృశ్యాలు కల్యాణదుర్గంలోని పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ కావటంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
ఇదీచదవండి