శునకాలకు విశ్వాసం ఎక్కువ ఉంటుందనడానికి నిదర్శనం ఈ సంఘటన. ఎదురుగా ఉన్నది తమకన్నా బలమైన జంతువు అని తెలిసినా... కూడు పెట్టిన యజమానిని ఆపద నుంచి తప్పించడానికి చిరుతపులితో పోరాడాయి. యజమానిని రక్షించుకున్నాయి.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామశివారులో... గొర్రెల కాపరి బోయ చంద్రమోహన్పై చిరుతపులి దాడి చేసింది. చెన్నంపల్లి గ్రామానికి చెందిన బోయ చంద్ర గొర్రెలను మేపడానికి ఊరు శివారుకు తోలుకెళ్లారు. పొదల్లో దాగివున్న చిరుత ఒక్కసారిగా గొర్రెల కాపరిపై దాడి చేసింది. తన వెంట వచ్చిన శునకాలు మొరిగి.. చిరుతతో పోరాడాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు క్షతగాత్రుడిని కళ్యాణదుర్గం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సమీపంలో తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి...