Land Grabs By YCP Leader : అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే పొలాన్ని కబ్జా చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులను, పోలీసుల్ని రంగంలోకి దింపాడని వాపోయాడు ఆ రైతు. అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి కొడిమి గ్రామం పరిధిలో ఐదు ఎకరాల పొలం ఉంది. మాజీ సైనికునికి ఇచ్చిన ఆ పొలాన్ని 2014వ సంవత్సరంలో అతను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్వోసీ తీసుకున్నారు.
" ఆ భూమిని మాజీ ఆర్మీ అతనికి ఇచ్చారు. నేను 2014 ఆయన దగ్గర భూమి కొన్నాను. దొంగ భూమి అంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఇబ్బంది పెడుతున్నారు." - మహేందర్ రెడ్డి, బాధిత రైతు
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పొలంపై అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కన్నేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పొలం వద్ద ఉన్న సమయంలో తన అనుచరుల్ని పంపించి స్టేషన్‌కు తీసుకొచ్చారని రైతు వాపోయారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు తన పొలాన్ని కబ్జా చేయాలని తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని, అసభ్యంగా దూషిస్తూ నానా హంగామా చేశారని బాధిత రైతు మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తనను ఇబ్బందులకు గురి చేస్తే ఎవరికీ చెప్పుకోవాలని ప్రశ్నించారు.
" ఎస్ఐగారితో మాట్లాడితే చాలా నిర్లక్షంగా.. తనకు తహశీల్జార్ కంప్లైంట్ చేశారని అన్నారు. కంప్లైంట్ కాపీ చూపించమని అడిగితే లేదు ఓరల్‌గా ఫోన్లో చెప్పారని అన్నారు. ఫోన్లో చేపితే రికార్డు చూడకుండా ఏ విధంగా ఓ రైతును తీసుకువచ్చి ఎసా నిర్బంధిస్తారని అని అడిగితే.. సీఐ గారితో మాట్లాడుకోండి అన్నారు. సీఐ గారికి ఫోన్ చేశా జరిగిన విషయం చెబితే 15 నిమిషాల్లో వస్తున్నా ఆగండీ అన్నారు. మేము రికార్డ్స్ తెప్పించాము. సీఐగారు రెండు గంటలు అయిన రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు అందరూ స్టేషన్ ముందు ధర్నా చేస్తామంటే, అప్పుడు సీఐ గారు వచ్చి మీ రికార్డ్ అంతా కరెక్టుగా ఉంది మీరు వెళ్లిపోవచ్చు అన్నారు. తహశీల్ధార్ గారికి రికార్డ్ మొత్తం ఇచ్చి పోండి అన్నారు. ఎలాగైనా భయబ్రాంతులకు గురి చేసి రైతు దగ్గర ఎమ్మెల్యే గారు భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. " - రాజా రెడ్డి, న్యాయవాది
ఇవీ చదవండి