తన భర్త మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మృతుడు దేవపుత్ర భార్య పద్మజ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతపురం నగర శివారు పిల్లిగుండ్లకాలనీలో ఉపాధ్యాయులైన భార్యాభర్తలు దేవపుత్ర, పద్మజ నివాసముంటున్నారు. దేవపుత్ర సింగనమల మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. పద్మజ నగరంలోని 15వ వార్డు నగరపాలక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
మృతుడు తీవ్ర జ్వరంగా కారణంగా ఎన్నికల విధులకు హాజరుకాలేనని విన్నవించినా పై అధికారులు పట్టించుకోలేదని పద్మజ ఆరోపించారు. తాడిపత్రి మండలం బోగసముద్రం 6 నెంబర్ పోలింగ్ కేంద్రంలో విధులు ముగించుకుని బ్యాలెట్ బాక్స్‌లతో బస్సులో వస్తున్న దేవపుత్ర హఠాత్తుగా ఒక్కసారిగా బస్సులోనే కుప్పకూలాడు. ఆరోగ్యం సరిగా లేదని బస్సుని ఆస్పత్రికి తీసుకెళ్లాలని.. అక్కడి సిబ్బందిని కోరినా వారు స్పందించలేదని తెలిపారు. ఎన్నికల విధుల ప్రకారం బస్సు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్లాలని వారు వాదించారని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తన భర్త మృతి చెందాడని వాపోయారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని.. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: