రాయదుర్గం నియోజకవర్గంలో డి. హిరేహాల్ మండలం మల్లికేతి గ్రామంలో ఓ మహిళా రైతు పిడుగుపాటుకు మృతి చెందింది. మృతి చెందిన మహిళ లక్ష్మి(35)గా స్థానికులు తెలిపారు. పొలంలో పని చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు ఇద్దరు సంతానం. తోటి కూలీలు చూస్తుండగానే ఆమె క్షణాల్లో మరణించడం వల్ల గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి :