ETV Bharat / state

విద్యా శాఖలో ఉప సారథులు కావాలి!

author img

By

Published : Jul 30, 2020, 10:47 AM IST

అనంతపురం జిల్లాలో విద్యాశాఖను నడిపే ఉపసారథులు ఒక్కొక్కరుగా ఉద్యోగ విరమణ చేస్తున్నారు. దీంతో జిల్లా విద్యాధికారిపై పని భారం పడుతోంది. అన్నింటినీ చక్కదిద్దడం ఆయనకు తలకు మించిన భారం అవుతోంది. అనంతపురం జిల్లా వైశాల్యంలో పెద్దది. సరిహద్దు మండలాలకు వెళ్లాలంటే కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఒక్కరే పర్యవేక్షించడం కష్ట సాధ్యమే. అధికార యంత్రాంగం పర్యవేక్షణ తగ్గిపోవటంతో ఆ ప్రభావం విద్యార్థుల భవితపై పడుతోంది.

lack of deputy mandal educational officers in ananthapuram district
విద్యా శాఖలో ఉప సారథులు కావాలి!

సెప్టెంబరు 5నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖలో నాడు నేడు పనులు, విద్యాదీవెన కిట్ల పంపిణీ, బదిలీలకు సంబంధించి వివరాల క్రోడీకరణ తదితర అంశాలపై తలమునకలవుతున్నారు. ఇలాంటి సమయంలో పర్యవేక్షణాధికారులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 3 ఉప విద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 31న మరో ఉపవిద్యాశాఖాధికారి ఉద్యోగ విరమణ చేయనున్నారు.

  • పర్యవేక్షణ ఎలా?

విద్యాశాఖలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించాలి. డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు.. ఇలా అందరికీ బాధ్యతలు అప్పగించారు. జిల్లా విద్యాశాఖకు సంబంధించి 4 డివిజన్లు ఉన్నాయి. అనంతపురం ఉపవిద్యాశాఖాధికారి పోస్టు పదేళ్లుగా ఖాళీగా ఉంది. మూడేళ్ల నుంచి డీఈఓ కార్యాలయ ఏడీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ధర్మవరం డివిజన్‌ ఉపవిద్యాశాఖాధికారి మే నెలలో, పెనుకొండ ఉపవిద్యాశాఖాధికారి జూన్‌లో ఉద్యోగ విరమణ పొందారు. ఇక్కడ ఇన్‌ఛార్జిలను కూడా నియమించలేదు. గుత్తి డివిజన్‌ ఉపవిద్యాశాఖాధికారి శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో డివిజన్ల పర్యవేక్షణ ఎలా అన్నదే ప్రశ్నార్థకం.

  • తనిఖీలు చేసేదెవరు?

ప్రతి ఉపవిద్యాశాఖాధికారి నెలకు కనీసం 5 ఉన్నత పాఠశాలల్లో రికార్డులను పరిశీలించి, లోటుపాట్లను ఆర్జేడీకి నివేదించాలి. లోపాలు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే నెలకు కనీసం 15 నుంచి 20 ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయాలి. ప్రతి నెలా ట్యాబులేషన్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (టీఐఆర్‌) పంపాల్సి ఉంది. సమావేశాలు, ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు తదితర విధులు నిర్వర్తిస్తున్నారు.ఆదర్శ పాఠశాలల్లోనూ అంతే.. ఆదర్శ పాఠశాలలకు ప్రత్యేకంగా పరిపాలనాధికారి ఉండాలి. ఈ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాలో 25 ఆదర్శ పాఠశాలలు, 20 వసతి గృహాలు, బోధన, బోధనేతర సిబ్బందిని సమన్వయం చేస్తూ పాలన సాగించాల్సి ఉంది. పాలనాధికారి లేక ఫలితాలు, బోధనా ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి.

  • ఎంఈఓలు ఏరి?

మండలంలో విద్యాశాఖను గాడిన పెట్టాల్సిన ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. 47 మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు ఉన్నారు. 16 మండలాలకు పొరుగున ఉన్న ఎంఈఓలను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. కుందుర్పి మండల విద్యాధికారి కణేకల్లు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈయన కుందుర్పి నుంచి కణేకల్లుకు వెళ్లాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇదే సమస్య పలుచోట్ల ఉంది. దీంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

సమస్య లేకుండా చూస్తున్నాం

ఉపవిద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓ ఏడీకి అర్హత ఉండటంతో ఇన్‌ఛార్జి ఇచ్చాం. రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నచోట ఇన్‌ఛార్జిలతో చక్కబెడుతున్నాం. ఏకీకృత సర్వీసు విధానం కొలిక్కి రాకపోవటంతో సమస్య తలెత్తింది. ఎక్కడైనా సమస్య రాగానే వెంటనే చక్కబెడుతున్నాం. - శామ్యూల్, డీఈఓ

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు: 5129

విద్యార్థుల సంఖ్య: 6,09,662

ప్రభుత్వ ఉపాధ్యాయులు: 17,058

ఉపవిద్యాశాఖాధికారుల ఖాళీలు: 4 (31న ఒకటి ఖాళీ)

ఎంఈఓ పోస్టుల ఖాళీ: 16

ఇవీ చదవండి..

సైబర్ నేరస్థుల కొత్త పంథా.. కస్టమర్ కేర్ నెంబర్లతో నయా మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.