ETV Bharat / state

అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్.. ఎక్కడంటే?

Konampally village volunteer illegal liquor transporting: గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి.. కర్ణాటక రాష్ట్రం నుంచి తన సొంత వాహనంలో అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన మద్యం విలువ దాదాపు ఒక లక్ష పదివేల రూపాయల వరకూ ఉంటుందని ఎస్ఈబీ పోలీసులు తెలిపారు. వాలంటీర్‌తో పాటు మద్యాన్ని తరలిస్తున్న కారును, కారు యజమాని శ్రీధర్‌, డ్రైవర్ సుధాకర్‌లను అదుపులోకి తీసుకుని.. వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు.

valanteer arrest
valanteer arrest
author img

By

Published : Mar 1, 2023, 3:33 PM IST

Konampally village volunteer illegal liquor transporting: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీధర్‌.. కర్ణాటక రాష్ట్రం నుండి తన స్వగ్రామానికి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా కళ్యాణదుర్గం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యంతో పట్టుబడిన వాలంటీర్ శ్రీధర్‌.. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ బంధువు అయిన వైసీపీ నాయకుడి తనయుడిగా అధికారులు గుర్తించారు.

ఎస్ఈబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్యాణదుర్గం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీధర్.. తన సొంత కారులో కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్లను తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడిన కర్ణాటక మద్యం విలువ దాదాపు ఒక లక్ష పదివేల రూపాయల వరకూ ఉంటుందన్నారు. కర్ణాటక మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకొని.. కారు యజమాని శ్రీధర్ (వాలంటీర్), డ్రైవర్ సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.

అనంతరం కారును పూర్తిగా తనిఖీలు చేయగా అందులో దాదాపు 20 కేసుల కర్ణాటక టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే నిందితులను, కారును అదుపులోకి తీసుకొని వారిని స్టేషన్‌కు తరలించి సెబ్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే వీరిని రిమాండ్ పంపనున్నామని, స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షా పది వేలుగా ఉంటుదని అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వాలంటీర్ అక్రమ మద్యం రవాణాపై సీఐ లక్ష్మణరావు తీవ్రంగా ఆగ్రహించారు. గ్రామ వైసీపీ నాయకుడి హనుమంతారాయుడు తనయుడు శ్రీధర్‌.. ఓవైపు గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ అక్రమ మద్య రవాణాకు పాల్పడుతున్నారన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరొకరు డ్రైవర్ సుధాకర్ కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన వ్యక్తిగా తమ పోలీసు సిబ్బంది గుర్తించారన్నారు.

వాలంటీర్ శ్రీధర్‌.. కోనంపల్లి గ్రామ వైసీపీ నాయకుడి హనుమంతారాయుడు తనయుడు కావడం.. అధికార పార్టీ బెళుగుప్ప ఎంపీపీ పెద్దన్న స్వయానా బంధువు కావడంతో అక్రమ సంపాదనలకు పాల్పడుతూ.. ఎంపీపీ అండదండలతో పలు గ్రామాల్లో యథేచ్ఛగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇదే కారులో వాలంటీర్ శ్రీధర్‌.. అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడ్డారు. కానీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పైరవీలతో బయటికొచ్చారని సమాచారం. అయినా కూడా తీరు మార్చుకోకుండా మళ్లీ అదే వాహనంలో స్వగ్రామం చుట్టుపక్కల గ్రామాల్లోకి యథేచ్ఛగా మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి.. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.