ETV Bharat / state

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం - Kia India Latest News

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. విరాళ చెక్కులను కియా ఇండియా ఎండీ, సీఈవో షిమ్‌.. సీఎం జగన్​కు అందించారు. విరాళం నగదుతో వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కియా కోరింది.

కియా ఇండియా సాయం
కియా ఇండియా సాయం
author img

By

Published : May 19, 2021, 7:33 PM IST

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యల కోసం కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్థకు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విరాళానికి సంబంధించిన పత్రాలను సీఎం జగన్​కు కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో కుక్​హ్యున్‌ షిమ్‌ అందించారు. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలు వినియోగించాలని కోరారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్, క్రయోజనిక్‌ ట్యాంకర్ల అవసరాలు వినియోగించాలని విన్నవించారు.

ఇదీ చదవండీ... గనుల శాఖ: కీలక నిర్ణయాలకు సీఎం జగన్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.