ETV Bharat / state

'ఎకరాకు 60 కేజీలు చాలు..అనవసరంగా పెట్టుబడి పెంచుకోకండి' - 'ఎకరాకు 60 కేజీలు చాలు..అనవసరంగా పెట్టుబడి పెంచుకోకండి

అనంతపురం జిల్లాలో ఈసారి వర్షాలు సకాలంలో కురిశాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు మండలాలు మినహా అన్నిచోట్లా సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. దుర్భిక్ష ప్రాంతాలైన కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో కూడా ఈసారి జూన్​లోనే నేల పదును వర్షాలు కురియటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభంపై వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు హబీబ్ బాషతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'ఎకరాకు 60 కేజీలు చాలు..అనవసరంగా పెట్టుబడి పెంచుకోకండి'

author img

By

Published : Jul 5, 2020, 4:34 PM IST

ప్రశ్న: ఈసారి సీజన్ ఎలా ఉంది?

జవాబు: జిల్లాలో ఈసారి జూన్ తొలి వారంలోనే సమయానుకూలంగా మంచి వర్షాలు కురిశాయి. పన్నెండున్నర లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేస్తారు. అన్ని పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు నమోదయ్యాయి.

ప్రశ్న: ప్రస్తుతం ఏ పంటలను రైతులు సాగు చేస్తున్నారు ?

జవాబు: ఈసారి గ్రామస్థాయిలో విత్తన పంపిణీ చేయటం రైతులకు చాలా మేలు జరిగింది. కేవలం వారం రోజుల్లో రైతులందరికీ వేరుశనగ విత్తనం అందించగలిగాం. జిల్లాలో 2.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు పంపిణీ చేశాం. రోజుమార్చి రోజు వర్షాలు కురుస్తుండటంతో అన్నిచోట్లా 15 శాతం అదనంగా వర్షం నమోదైంది. అన్నిచోట్లా విత్తనం వేయటం పుంజుకుంది.

ప్రశ్న: అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాల్లో మంచి వర్షాలు నమోదయ్యాయి, ఇంకా లోటు వర్షపాతం నమోదవుతున్న మండలాలెన్ని ?

జవాబు: జిల్లాలో మంచి వర్షాలు నమోదవటంతో రాయదుర్గంలోని హగరి నదికి కూడా వరద వచ్చింది. కదిరి, కళ్యాణదుర్గంలో కూడా ఆశించిన వర్షపాతం నమోదైంది. ఈసారి జూన్​లోనే మంచి వర్షాలు కురవటంవల్ల సీజన్ అంతా బాగుంటుందని అందరం భావిస్తున్నాం. రైతులు ఎకరాకు వంద కిలోల వేరుశనగ విత్తనం వాడుతున్నారు, ఇది చాలా ఎక్కువ అరవై కిలోల విత్తనం సరిపోతుంది. దీనివల్ల రైతులు అనవసరంగా పెట్టుబడిని పెంచుకుంటున్నారు.

ప్రశ్న: నేల పూర్తిగా పదునైందంటున్నారు రైతులు అంతర పంటలుగా ఏం వేస్తున్నారు ?

జవాబు: అనంతపురం జిల్లాలో వేరుశనగలో కందిని అంతర పంటగా సాగుచేస్తుంటారు. ఇతర పంటల్లో కందిని వేయటం అన్ని జిల్లాల్లో సాధారణమైనప్పటికీ, వేరుశనగలో వేయటం అనంత జిల్లాకే ప్రత్యేకం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగుమందులు ఇస్తున్నాం. భవిష్యత్ లో రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించనున్నాం.

ప్రశ్న: రైతులకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందుల నిల్వలు ఎలా ఉన్నాయి ?

జవాబు: జిల్లాలో రైతులకు అవసరమైన దుక్కిలో వేసే ఎరువులు, పంటదశలో వేసే ఎరువులు సిద్ధంగా ఉంచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి వద్దకే ఎరువులను అందిస్తున్నాం. పురుగు మందల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తరువాతనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వారం రోజుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.